Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన వైఖరితోనే ఇసుక కొరత….

ఆయన వైఖరితోనే ఇసుక కొరత….

గుంటూరు: సీఎం జగన్ వైఖరితోనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ఇసుక కొరతతో ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను సీపీఐ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరతతో వేలాది మంది కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోనే ఐదు మంది కార్మికులు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు 20 వేలు ఇవ్వాలని కోరారు. వరదల వల్ల ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగైతే ఇతర రాష్ట్రాల్లో లేని వరద ఏపీలోనే ఉందా?, ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకుంది?, ప్రభుత్వ పెద్దల అండతో ఇసుక ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు? అని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *