Breaking News
Home / National / సాధ్వీకి సీటు కన్ఫామ్.. పోటీ ఆయనపైనే!

సాధ్వీకి సీటు కన్ఫామ్.. పోటీ ఆయనపైనే!

భోపాల్: సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌కి బీజేపీ అధిష్ఠానం సీటు కన్ఫామ్ చేసింది. భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. మాలేగావ్ పేలుళ్ల నిందితురాలిగా ఉన్న సాధ్వీ ప్రగ్యా సింగ్.. బుధవారం బీజేపీలో చేరారు. ఇలా కండువా కప్పుకున్నారో లేదో.. అలా భోపాల్ ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరును ఖారరు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ను సాధ్వీ ఎదుర్కోబోతున్నారు. బీజేపీ తాజా ప్రకటనతో భోపాల్ సీటు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ స్థానం నుంచి తాను కచ్చితంగా గెలుస్తానని సాధ్వి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న వారిపై కలిసికట్టుగా పోరాటం సాగిస్తామని, ఈ ధర్మయుద్ధంలో తాము గెలుస్తామని అన్నారు. ‘కాంగ్రెస్ కుట్ర వల్ల పదేళ్లు జైలులో గడిపాను. రాజకీయ, మతపరమైన యుద్ధంలో పోరాడేందుకు నేను ఇక్కడకు వచ్చాను’ అని చెప్పారు. తాజాగా ప్రకటించిన జాబితాలో సాధ్వీతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. గుణ నుంచి డాక్టర్ కేపీ యాదవ్, సాగర్ నుంచి రాజ్ బహదూర్ సింగ్, విదిషా నుంచి రమాకాంత్ భార్గవ్ పోటీ చేస్తున్నారు. ఆరోవిడతలో జరిగే పోలింగ్‌లో ఈ నలుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *