Breaking News
Home / States / రెండో రోజు కొనసాగుతున్న చండీ యాగం….

రెండో రోజు కొనసాగుతున్న చండీ యాగం….

ఖమ్మం: ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణపురంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగం సోమవారం రెండో రోజు కొనసాగుతోంది. ఐదు రోజులపాటు జరగనున్న ఈ యాగం పొంగులేటికి చెందిన మామిడి తోటలో యాగశాలను నిర్మించి రుత్వికుల సమక్షంలో చేస్తున్నారు. లోక కల్యాణం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిన్న ప్రారంభమైన ఈ యాగం అక్టోబర్ 17న ముగియనుంది. ఈ సహస్ర చండీ యాగం 9 మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *