Breaking News
Home / States / Andhra Pradesh / నెల్లూరు జిల్లా నుంచి రెండో ప్రత్యేక రైలు

నెల్లూరు జిల్లా నుంచి రెండో ప్రత్యేక రైలు

నెల్లూరు: లాక్‌డౌన్‌తో జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీను తీసుకుని రెండో ప్రత్యేక రైలు ఆదివారం బిహార్‌కు బయలుదేరింది. మూడు రోజులుగా వలస కూలీలు జిల్లాలోని పలు మండలాల నుంచి సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆదివారం అనుమతి రావడంతో జిల్లా అధికారులు తొలుత 40 బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు చేరి, రైలెక్కించి స్వస్థలాలకు పంపారు. ముందుగా బిహార్‌కు చెందిన సుమారు 2345 మంది కూలీలు వారి స్వస్థలాలకు పోయేందుకు దర ఖాస్తు చేసుకోగా, మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ ప్రత్యేక శ్రామిక్‌ రైలులో 1200 మందిని పంపించారు. మిగతా 1145 మందిని ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన రెండో శ్రామిక రైలులో పంపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *