Breaking News
Home / National / శివసేన, బిజెపి కలిసే అవకాశం ఉంది

శివసేన, బిజెపి కలిసే అవకాశం ఉంది

శివసేన మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబయి: ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో బిజెపి, శివసేన కలిసి పోటీ చేశాయి. కానీ సీఎం పీఠంపై సయోధ్య కుదరకపోవడంతో రెండు పార్టీలు విడిపోయాయి. కాగా శివసేనకు చెందిన సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో శివసేన, బిజెపి కలిసే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. దీనిపై తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న విషయాలపై విభేదించుకోవడం కంటే సర్దుకుపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఇరువర్గాలకూ లబ్ధిచేకూరుతుందని ఆయన తెలియజేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మనోహర్‌ జోషి తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *