Breaking News
Home / National / మోదీ ఫొటోలపై నిశ్శబ్ద గుర్తు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న‘ది టెలిగ్రాఫ్’ పోస్ట్

మోదీ ఫొటోలపై నిశ్శబ్ద గుర్తు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న‘ది టెలిగ్రాఫ్’ పోస్ట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న మోదీ.. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులివ్వలేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రమే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు. దీంతో మీడియా సమావేశంలో మోదీ వ్యవహారశైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మీడియా సమావేశంలో మోదీ వ్యవహారశైలి పట్ల ది టెలిగ్రాఫ్ అనే మీడియా సంస్థ తనదైన శైలిలో స్పందించింది. మీడియా సమావేశంలో మోదీ హావభావాలు ఎలా ఉన్నాయో ప్రచురించిన ఆ సంస్థ.. మోదీ ఫొటోలపై నిశ్శబ్ద గుర్తును ఉంచింది. అంతేకాకుండా ఫొటోల కింద కొంత భాగాన్ని ఖాళీగా వదిలేసి.. మోదీ ఏమైనా మాట్లాడితే ప్రచురిస్తాం అంటూ వ్యంగ్యంగా రాసింది.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *