Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాష్ట్రంలో పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో పరిస్థితి అధ్వానం

ప్రాంతీయ పార్టీల్లో పెరిగిన అవినీతి
బీజేపీతోనే దేశాభివృద్ధి: కన్నా
అమరావతి: ‘‘ప్రాంతీయ పార్టీల్లో అవినీతి, అక్రమాలు పెరిగి పోయాయి. టీడీపీని ఓడించి వైసీపీకి ప్రజలు పట్టం కడితే పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. టీడీపీ, వైసీపీ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని దేశ ప్రజలు బలంగా నమ్ముతున్నారు’’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేశ సమైక్యత, సమగ్రతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం దేశానికి బీజేపీ అవసరం ఎంతో ఉందని, ఈ విషయాన్ని నమ్మిన ప్రజలు దేశ ప్రగతి కోసం మోదీని మరోసారి ఆశీర్వదించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని మోదీ, అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీని అమిత్‌ షా సమర్ధవంతంగా నడిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

టీటీడీతో ఆడుకోవడం మంచిదికాదు: బీజేపీ
‘‘రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని ఆటవస్తువులా భావించి ఆడుకోవడం మంచి పద్ధతి కాదు. టీటీడీ చరిత్రను తెలుసుకోకుండా ఏ ప్రాతిపదికన సీఎం జగన్మోహన్‌రెడ్డి బోర్డు సభ్యులను నియమించారో అర్థం కావడం లేదు. జంబో పాలకమండలిని నియమించి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు, ప్రమాణస్వీకారోత్సవానికి రండి అంటూ ఢిల్లీలోని ప్రొఫెసర్‌ రాజేశ్‌ శర్మకు అధికారులు ఫోన్‌ చేశారని చెప్పారు. మరలా వారం రోజులకి… ఎన్నికైంది మీరు కాదు… ముంబయికి చెందిన రాజేశ్‌ అంటూ ఫోన్‌ చేశారని ఆరోపించారు. బోర్డు సభ్యుడి విషయంలో పొరపాటు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *