Breaking News
Home / States / Andhra Pradesh / కొడుకే కాలయముడు…తల్లి సాయంతో ఇంటి ముందు పాతిపెట్టిన వైనం

కొడుకే కాలయముడు…తల్లి సాయంతో ఇంటి ముందు పాతిపెట్టిన వైనం

కొడుకే కాలయముడు
కర్రతో తలపై మోది తండ్రిని హతమార్చిన కుమారుడు
తల్లి సాయంతో ఇంటి ముందు పాతిపెట్టిన వైనం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్యోదంతం

కాకినాడ రూరల్‌: అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు.. కర్కశంగా మారి తండ్రినే మట్టుపెట్టాడు.. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి పక్కనే పాతిపెట్టాడు.. అయితే తండ్రిని తానే కడతేర్చానంటూ మద్యం మత్తులో నిజం చెప్పేశాడు.. అనంతరం భయంతో పురుగులమందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట బర్మాకాలనీలో జరిగిన ఈ దారుణం 54రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ బర్మాకాలనీకి చెందిన గోపిరెడ్డి ఈశ్వరరావు (55)కు భార్య లక్ష్మి నలుగురు కుమార్తెలు. స్థానికంగా పందుల పెంపకంతోపాటు మాంసం విక్రయిస్తుంటాడు. నలుగురిలో ముగ్గురికి వివాహాలయ్యాయి. ఆఖరి కుమార్తె హాస్టల్‌ ఉంటూ చదువుకుంటుంది. నలుగురు కుమార్తెలు కావడంతో ఈశ్వరరావు చెల్లెలి కొడుకు కుమార్‌ను (21) చిన్నప్పట్నుంచి పెంచుకుంటున్నాడు.

మద్యానికి బానిసైన ఈశ్వరరావు తరచూ మద్యం తాగి ఇంట్లో భార్య, కొడుకు, కూతురితో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 17న మద్యం తాగి వచ్చి కొడుకు, భార్యతో తగాదా పడ్డాడు. ఆవేశానికి గురైన ఈశ్వరరావు కత్తితో కొడుకుపై దాడి చేయబోయాడు. దీంతో కొడుకు భయపడి పక్కనే ఉన్న కర్రతో తండ్రిని తలపై మోది చంపేశాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా తల్లి సహాయంతో ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో గొయ్యి తీసి కప్పెట్టారు. అనంతరం తన తండ్రి కనబడటం లేదని తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వ డంతో పోలీసులు మ్యాన్‌ మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అనంతరం తనకు ఏమీ తెలియదన్నట్టు స్ధానికులను నమ్మిస్తూ దర్జాగా తిరిగాడు. అయితే ఈ నెల 8న మద్యం మత్తులో ఉన్న కుమార్‌ స్థానికులతో తన తండ్రిని చంపినట్టు నోరుజారాడు. దాంతో పోలీసులకు చెబుతారన్న భయంతో అదే రోజు తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు కుమార్‌ను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. తిమ్మాపు రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈశ్వరరావు మృతదేహానికి పంచనామా
ఈశ్వరరావు మృతదేహాన్ని సోమవారం పోలీసుల సహాయంతో రెవెన్యూ సిబ్బంది వెలికితీసి వైద్యులు సమక్షంలో పంచనామా నిర్వహించారు. విష యం బయటకు తెలియడంతో ప్రస్తుతం తల్లి లక్ష్మి పరారీలో ఉన్నట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు.

Check Also

ప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన

Share this on WhatsAppప్రతేక్య హోదాపై సభలో సీఎం ప్రకటన అమరావతి: అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రతేక్య హోదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *