Breaking News
Home / National / రాష్ట్రంలో మద్యనిషేధం విధించడం లేదు…సీఎం స్పష్టం

రాష్ట్రంలో మద్యనిషేధం విధించడం లేదు…సీఎం స్పష్టం

ఉదయ్‌పూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు వచ్చిన వార్తలు పుకార్లేనని, తాను మద్యనిషేధం విధించడం లేదని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నపుడే మద్య నిషేధం విధిస్తామని సీఎం చెప్పారు. తాను వ్యక్తిగతంగా మద్య నిషేధానికి అనుకూలమని, కాని అక్రమంగా మద్యం పారకుండా చర్యలు తీసుకున్న తర్వాతే మద్యంపై నిషేధాన్ని విధిస్తామని చెప్పారు. 1977లో ఒకసారి రాజస్థాన్ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించినా, అమలులో విఫలమయ్యారని సీఎం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో నిషేధం అమలులో ఉన్నా దేశంలోనే అత్యధికంగా మద్యం అక్రమంగా విక్రయం సాగిందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. తాను ఏడాది పాటు గుజరాత్ రాష్ట్రంలో ఉండి చూశానన్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గుజరాత్ లో మద్యం వినియోగం అధికంగా ఉందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *