Breaking News
Home / States / రాష్ట్రాలు వేరైనా… సంప్రదాయాలు ఒక్కటే…

రాష్ట్రాలు వేరైనా… సంప్రదాయాలు ఒక్కటే…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం జలవిహార్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగులో మాట్లాడారు. తెలంగాణ గవర్నర్‌గా రావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి అన్ని పార్టీల వారు రావటం సంతోషకరమని అన్నారు. తనకు బతుకమ్మ పండుగ చాలా బాగా నచ్చిందన్నారు. ఐదు రోజుల పాటు రాజ్‌భవన్‌లో బతుకమ్మ పండుగ నిర్వహించామని చెప్పారు. రాష్ట్రాలు వేరైనా.. తమిళనాడు, తెలంగాణ సంప్రదాయాలు ఒక్కటేనని అన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని, ఒక డాక్టర్‌గా చెప్తున్నానని అన్నారు. తెలంగాణలో చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని.. పత్రికల్లో చదివానన్నారు. బర్గర్లు, చిప్స్ లాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలని గవర్నర్ తమిళసై సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *