Breaking News
Home / States / Andhra Pradesh / రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాము…

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాము…

శ్రీకాకుళం : టీడీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. టీడీపీ పూర్వవైభవం సిక్కోలు నుంచే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కార్యకర్తలంటే భయం, పసుపురంగు చూసి భయంతో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతోందని వ్యాఖ్యనించారు. కార్యకర్తలపై పెట్టిన తప్పడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు వైసీపీ రంగులు వేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో జగన్‌ తుగ్లక్‌ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నర నెలల పాలనలోనే రాష్ట్రం పదో స్థానానికి పడిపోయిందని ఆయన విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *