Breaking News
Home / National / ఈ స్టేషన్‌కు రూ.20 ఆదాయం

ఈ స్టేషన్‌కు రూ.20 ఆదాయం

కేవలం ఇద్దరే ప్రయాణికులు..!

బిచ్చుపాలి: ప్రధాని నరేంద్రమోదీ ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్‌లో కేవలం ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్‌కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. ఇంతకీ అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఒడిశాలోని బొలంగిర్‌ జిల్లాలో బిచ్చుపాలిలో ఈ రైల్వేస్టేషన్‌ ఉంది. దాదాపు రూ.115కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వేలైన్‌ వేశారు. గతేడాది జనవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్‌ ప్రారంభమైంది.

బొలాంగిర్‌-బిచ్చుపాలి మధ్య 16.8కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ వేశారు. ఎప్పుడు చూసినా ఈ రైల్వే స్టేషన్‌ ఖాళీగా కనిపిస్తుంది. అసలు ఈ రైల్వేస్టేషన్‌ ఆదాయమెంత అంటూ బొలాంగిర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సహచట్టాన్ని ఆశ్రయించారు. దీనికి సంబల్‌పూర్‌ డివిజన్‌ ఆఫ్ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సమాధానం ఇచ్చింది. రైల్వే స్టేషన్‌కు ఇద్దరే ప్రయాణికులు ఉన్నారని వారి ద్వారా రోజుకు రూ.20 ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే.. రైల్వేస్టేషన్‌ నిర్వహణ ఖర్చులు మాత్రం చెప్పలేదు. రూ.115కోట్లు ఖర్చు చేసి ఈ ట్రాక్‌ వేశారు. సోనేపూర్‌ రైల్వేలైన్‌కు దీన్ని కనెక్ట్‌ చేస్తే ఈ స్టేషన్‌ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి జేపీ మిశ్రా తెలిపారు.

Check Also

షహీన్‌బాగ్ నిరసనల్లో కీలక మలుపు..?

Share this on WhatsAppన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న షహీన్‌బాగ్ నిరసనలకు పరిష్కారం కనుగొనేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *