Breaking News
Home / States / Andhra Pradesh / కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత…

కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత…

గుంటూరు: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇటీవల బలవన్మరణాకి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనకు గుర్తుగా అభిమానులు విగ్రహన్ని ఆవిష్కరించాలనుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడానికి..టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం అక్కడి ఎన్టీఆర్ విగ్రహం పక్కన దిమ్మెను నిర్మించారు. అయితే ఈ విషయమై అర్థరాత్రి లింగరావుపాలెంలో వివాదం నెలకుంది. విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి అనుమతి లేదంటూ పంచాయితీ అధికారులు దిమ్మెను ధ్వంసం చేశారు. వారం క్రితమే విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి కోరామని అయినా అధికారులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *