Breaking News
Home / States / Andhra Pradesh / కోడెల విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ విగ్రహ దిమ్మె ధ్వంసం

కోడెల విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ విగ్రహ దిమ్మె ధ్వంసం

గుంటూరు: యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో టీడీపీ దివంగత నేత కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేయాలని భావించిన టీడీపీ శ్రేణులకు అధికారుల నుంచి అడ్డంకి ఎదురైంది. విగ్రహ దిమ్మెను ఇప్పటికే నిర్మించిన స్థానిక టీడీపీ కార్యకర్తలు సోమవారం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ విగ్రహ దిమ్మెను అధికారులు ధ్వంసం చేశారు. విగ్రహం ఏర్పాటు కోసం వారం క్రితమే కలెక్టర్ నుంచి అనుమతి కోరినట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా.. అధికారులు కోడెల విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం చేశాయి. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటోందని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *