Breaking News
Home / Lifestyle / Business / బడ్జెట్ జోష్… జెట్ స్పీడులో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..!

బడ్జెట్ జోష్… జెట్ స్పీడులో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..!

ముంబై: కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమర్పించిన తాజా బడ్జెట్‌పై సానుకూల అంచనాల నేపథ్యంలో దేశీయ మార్కెట్ సూచీలు భారీ లాభాలు నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా… నిఫ్టీ సైతం మరోసారి 11,000 మార్కు ఎగువన ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నం 1.35 సమయానికి సెన్సెక్స్ కొద్దిగా నెమ్మదించి 426.43 పాయింట్లు (1.18 శాతం) లాభంతో 36,683.12 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 149 పాయింట్లు (1.38 శాతం) దూసుకెళ్లి 10,979.95 వద్ద కొనసాగుతోంది. ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, రియల్టీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు భారీ లాభాలు నమోదు చేశాయి.

Check Also

పసిడికి కళ

Share this on WhatsAppమళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం అంతర్జాతీయ పరిణామాలే కారణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *