హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన అధ్యయన కమిటీ కేసీఆర్‌కు నివేదిక అందించింది. హైకోర్టు ఆదేశాలమేరకు.. విలీనం మినహా 21 డిమాండ్ల సాధ్యసాధ్యాలపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆరుగురు ఈడీలతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అధ్యయన కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. కోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా కమిటీ సభ్యులు రిపోర్టు తయారు చేశారు. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది.
