Breaking News
Home / States / Andhra Pradesh / ఆ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది…

ఆ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది…

కాకినాడ: ‘దిశ’ కేసులో ప్రజలు కోరుకున్న తీర్పే వెలువడిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో మహిళల రక్షణ, భద్రత చాలా ప్రధానమైందన్నారు. ఈ అంశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని పేర్కొన్నారు. తీర్పులు, శిక్షలు చాలా కఠినంగా అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ‘దిశ’ ఘటన దేశాన్నే కుదిపేసిందన్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తప్పకుండా చట్టాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘సమాజంలో మహిళల పట్ల భక్తి అయినా ఉండాలి, ప్రభుత్వం మీద భయమైన ఉండాలి. ఈ రెండు ఉంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని’ అభిప్రాయపడ్డారు. ఏపీలో మహిళల భద్రత చాలా ప్రధాన అంశంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *