హామిల్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఛేజింగ్‌లో తమకు మంచి రికార్డు ఉందని, అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. చాహల్ స్థానంలో కుల్దీప్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నట్లు కెప్టెన్ తెలిపాడు. పరిమిత ఓవర్లలో న్యూజిలాండ్ ప్రమాదకర జట్టు.. తొలి టీ20లో తమ సత్తాను భారత్‌కు న్యూజిలాండ్ రుచి చూపించింది కూడా. కానీ ఆ మ్యాచ్ నుంచి గుణపాఠాలు నేర్చుకొన్న రోహిత్ సేన.. రెండో టీ20లో ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. అదే జోరులో నేడు జరిగే ఆఖరిదైన మూడో మ్యాచ్‌నూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటోంది.
