Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / తెనాలిలో ఉద్రిక్తత…

తెనాలిలో ఉద్రిక్తత…

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెనాలి పురపాలక కార్యాలయం వద్ద తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ కార్యకర్తలు దహనం చేసి.. అక్కడే ఉన్న అమరావతి పరిరక్షణ ఐకాస చేపట్టిన దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో తోపులాట కూడా జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఐకాస రిలే నిరహార దీక్షా శిబిరంపై టమాట, కోడిగుడ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *