అద్దంకి : ముండ్లమూరు మండలానికి చెందిన చల్లా శివప్రసాద్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎనిమిది బైక్‌లను దొంగిలించడంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనితో బుధవారం ఉదయం అద్దంకి పోలీసులు చాకచక్యంగా బైక్‌ల దొంగైన శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బైక్‌ల విలువ అయిదున్నర లక్షల రూపాయలు ఉంటాయని దర్శి డీఎస్పీ వెల్లడించారు. నిందితున్ని పట్టుకోవడంలో పోలీసులు వ్యవహరించిన చాకచక్యాన్ని డీఎస్పీ అభినందించారు.
