Breaking News
Home / States / అక్కడ గాలి పీలిస్తే కేన్సరే..!

అక్కడ గాలి పీలిస్తే కేన్సరే..!

టైర్లు కాల్చే పరిశ్రమలతో ముప్పు
పైరోలసిస్‌ పరిశ్రమల్లో 2వ స్థానంలో రాష్ట్రం
నిబంధనలకు విరుద్ధంగా 61 పరిశ్రమలు
రీసైక్లింగ్‌తో గాల్లోకి ప్రమాదకర రసాయనాలు
హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆ మూడు ప్రాంతాల్లో పీల్చే గాలి విషంతో సమానం. అక్కడి పైరోలసిస్‌ పరిశ్రమల నుంచి ఏకంగా 34 రకాల కేన్సర్‌ కారక రసాయనాలు వెలువడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడ, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, యాదాద్రి-భువనగిరిలోని బొమ్మలరామా రం ప్రాంతాల్లోని పాత టైర్లను కాల్చే పైరోలసిస్‌ పరిశ్రమలు కేన్సర్‌ కారకాలుగా మారుతున్నాయి. 61 పైరోలసిస్‌ పరిశ్రమలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా, బ్రిటన్‌, పశ్చిమాసియాలో వాడిపారేసిన టైర్లను ఇక్కడికి దిగుమతి చేసుకుంటూ.. రీసైక్లింగ్‌ ప్రక్రియలో భాగంగా వాటిని తగులబెడుతుండటంతో ప్రమాదకర రసాయనాలు వెలువడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లోని పైరోలసిస్‌ పరిశ్రమలపై సోషల్‌ యాక్షన్‌ ఫర్‌ ఫారెస్ట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(ఎస్‌ఏఎ్‌ఫఈ) అనే సంస్థ ఇటీవల ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసింది. పైరోలసిస్‌ పరిశ్రమలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సీపీసీబీని ఎన్జీటీ ఆదేశించింది.

ఏం చేస్తారు?
పైరోలసిస్‌ పరిశ్రమల్లో పాత టైర్లను కాల్చి ఓ రకమైన ద్రవాన్ని, రీసైక్లింగ్‌ రబ్బర్‌ను సేకరిస్తారు
పర్యావరణం దృష్ట్యా పాశ్చాత్య దేశాల్లో పాత టైర్లను భారత్‌ లాంటి దేశాలకు తరలిస్తున్నారు
పాతటైర్లను పైరోలసిస్‌ పరిశ్రమల్లో ఆక్సిజన్‌ లేని రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు
దీని ద్వారా రీసైక్లింగ్‌ రబ్బరును సేకరిస్తారు. టైర్లను కాలుస్తున్నప్పుడు వచ్చే జిడ్డులాంటి ద్రవపదార్థాన్ని సేకరించి, దాని నుంచి ఆయిల్‌ను తయారు చేస్తారు. ఇది భారీ పరిశ్రమల్లోని బ్రాయిలర్లకు ఇంధనంగా ఉపయోగపడుతుంది
టైర్లను అసంపూర్తిగా కాల్చడంతో బెంజిన్‌, డయాక్సిన్‌, ప్యూరాన్స్‌, నైట్రోజన్‌ వంటి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన 34 కేన్సర్‌ కారక వాయువులు గాలిలో కలుస్తాయి.
దేశంలో..

మొత్తం పైరోలసిస్‌ ప్లాంట్ల సంఖ్య 637
నిబంధనలను పాటిస్తున్నవి 270
ఫిర్యాదులున్న
పరిశ్రమలు 251
మూసివేసిన ప్లాంట్ల సంఖ్య 116
అత్యధిక పైరోలసిస్‌ పరిశ్రమలున్న రాష్ట్రం: ఉత్తరప్రదేశ్‌ 117
రెండో స్థానంలో
ఉన్న రాష్ట్రం: తెలంగాణ 61

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *