ఫిల్మ్ న్యూస్: చదలవాడ బ్రదర్స్ సమర్పణలో లక్ష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి `వలయం` అనే టైటిల్ను ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దిగంగన సూర్యవన్షీ కథనాయికగా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రమేష్ కడుముల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2020లో ఈ సినిమా విడుదల కానుంది.
