Breaking News
Home / National / హింస బీజేపీ కిరాయి గూండాల పనే… వీడియా ఆధారం చూపిన టీఎంసీ

హింస బీజేపీ కిరాయి గూండాల పనే… వీడియా ఆధారం చూపిన టీఎంసీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ వెనుక బీజేపీ హస్తముందని తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాన్ని రిలీజ్ చేసింది. బయట నుంచి కిరాయి గూండాలను తెచ్చుకుని జరిపిన ఈ దాడుల వెనుక బీజేపీనే ఉందని ఆరోపించింది. ఈ ఘటనపై తమ పార్టీ ప్రతినిధి బృందం మధ్యాహ్నం 4.30 గంటలకు ఈసీని కలుసుకుని ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.

టీఎంసీ సీనియర్ నేత డెరిక్ ఒబ్రెయిన్ బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌కు ఎవరైనా రావచ్చని, ప్రచారం చేసుకోవచ్చని, అయితే బయట వ్యక్తుల మాటేమిటని నిలదీశారు. ‘తేజిందర్ బగ్గా ఎవరు? అతను అరెస్టయ్యాడు. ఢిల్లీలో ఎవరినో కొట్టిన తేజేందర్ బగ్గా ఇతను కాదా? మీరుకాదా బయట నుంచి గూండాలను తీసుకువచ్చింది? అని బీజేపీని డెరిక్ ఒబ్రెయిన్ నిలదీశారు. మరో రెండు ఫోటో ఆధారాలు కూడా ఆయన చూపిస్తూ, కేంద్ర బలగాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే బీజేపీతో కేంద్ర బలగాలు కుమ్మక్కయి పనిచేస్తుండటమే తమను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని ఆయన చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు జరిపిన రోడ్‌షో సమయంలో కోల్‌కతా వీధుల్లో హింసాకాండ చెలరేగింది. దీంతో అమిత్‌షా తన రోడ్‌షోను కుదించుకున్నారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *