Breaking News
Home / National / ఇద్దరు ఓటర్ల వయసు 265 ఏళ్లట…

ఇద్దరు ఓటర్ల వయసు 265 ఏళ్లట…

లూథియానా : ఇద్దరు ఓటర్ల వయసు 255 ఏళ్లట…మరో వృద్ధుడి వయసు 144 ఏళ్ల వయసట…ఇదీ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లా అధికారులు లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల జాబితాలోని ఓటరు సిత్రాలు…లూథియానా జిల్లాలో ఏకంగా 273 మంది అర్హులైన ఓటర్ల వయసు 118 ఏళ్లని ఓటర్ల జాబితాలో పేర్కొన్నారు. అమృతసర్ నగరంలో 558 మంది, హోషియార్ పూర్ లో 449 మంది ఓటర్ల వయసు వందేళ్లకు పైగా ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పంజాబ్ రాస్ట్రంలో 5,916 మంది ఓటర్ల వయసు వందేళ్లకు పైగా ఉందని సాక్షాత్తూ పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్ కె రాజు చెప్పారు. లూథియానా జిల్లాలో ఉన్న 57 మంది శతాధక ఓటర్లను బూత్ అధికారులతో పరిశీలన చేయించగా వారిలో 35 మంది మరణించారని తేలింది. లూథియానాకు చెందిన అక్షిత్ థావన్, గిల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన అశ్వనీకుమార్ ల వయసు ఓటర్ల జాబితాలో 265 ఏళ్లను అధికారులు పేర్కొన్నారు.

లూథియానాకు చెందిన శారదాదేవి అనే ఓటరు 1874వ సంవత్సరంలో జన్మించిందని ఓటర్ల జాబితాలో అధికారులు ఇచ్చారు. కాగా ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయని తాము పరిశీలన చేయించి సరిదిద్దుతామని లూథియానా డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ అగర్వాల్ చెప్పారు. 273 మంది ఓటర్ల వయసు 118 ఏళ్లని ఓటర్ల జాబితాలో వచ్చిందని, కాని వాస్తవానికి వారు కొత్తగా నమోదైన ఓటర్లని అధికారులు చెప్పారు. కొత్త ఓటర్లు 2000 సంవత్సరంలో జన్మించగా, వారు 1900 వ సంవత్సరంలో జన్మించినట్లు తప్పుగా నమోదు చేశారు. మొత్తంమీద అధికారులు రూపొందించిన ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా మారాయన్నది వాస్తవం. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పొప్పులను సరిచేసి ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తారా ? లేదా అనేది పోలింగ్ పర్వం దాకా వేచిచూడాల్సిందే.

Check Also

యధావిధిగా కొనసాగనున్న గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Share this on WhatsAppన్యూఢిల్లీ : టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *