పాట్నా : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాట్నాలోని ఒక ఆసుపత్రిని సందర్శించి అక్కడి రోగులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరదల అనంతర పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రిలో 119 డెంగ్యూ వ్యాధిగ్రస్తులు చేరారని, ప్రస్తుతం ఇంకా 16 మంది చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిని నియంత్రించడానికి కలిసి పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
