విజయవాడ: ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు గ్రామవాలంటీర్లు యత్నించడంతో ఆ సమయంలో కొంత గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే వాలంటీర్లు మాట్లాడుతూ తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని వారు మొరపెట్టుకున్నారు.
