పంజాబ్: గోడ కూలిన ఘటనలో అయిదుగురు చనిపోయారు. ప్రాణాలు కోల్పోయినవారిలో చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన పంజాబ్లోని అంబాలా కంటోన్మెంట్లో జరిగింది. గోడ శిథిలాల కింద చిక్కుకుని చిన్నారులు మృతిచెందారు. అంబాలాలోని కింగ్ ప్యాలెస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పిల్లలు నిద్ర పోతున్న సమయంలో గోడ కూలినట్లు పోలీసులు వెల్లడించారు.
