Breaking News
Home / Film News / ‘సైరా’ పై గట్టి ప్రభావాన్ని చూపిన ‘వార్’…

‘సైరా’ పై గట్టి ప్రభావాన్ని చూపిన ‘వార్’…

ఫిల్మ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా` సినిమా తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. విడుదలకు ముందు `సైరా`కు వచ్చిన బజ్ చూసి తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని అంచనాలు వెలువడ్డాయి.

ఉత్తరాంధ్ర, నెల్లూరు వంటి ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పినా కీలకమైన నైజాం ఏరియాలో మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి రోజు కలెక్షన్స్ విషయంలో `సాహో`, `బాహుబలి-2` తర్వాత మూడో స్థానానికి `సైరా` పరిమితమైంది. దానికి కారణం అదే రోజు విడుదలైన `వార్` సినిమా. `వార్` ప్రభావం `సైరా`పై ఉత్తరాదినే ఉంటుందని అందరూ భావించారు. అయితే నైజాం ఏరియాలో కూడా `వార్` ప్రభావం గట్టిగానే పడింది. తొలి రోజు ఒక్క హైదరాబాద్‌లోనే `వార్` సినిమావి 200కు పైగా షోలు వేశారు. దీంతో ఈ ప్రభావం `సైరా`పై పడింది. లేకపోతే `సాహో`ని `సైరా` కచ్చితంగా దాటేసి ఉండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తొలి రోజు `సాహో` సినిమా నైజం ప్రాంతంలో రూ.9.40 కోట్లు వసూలు చేసి తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో `బాహుబలి-2` (రూ. 8.90 కోట్లు), `సైరా` (రూ.8.10 కోట్లు) ఉన్నాయి. `సాహో`, `బాహుబలి-2` సినిమాలకు ఎలాంటి పోటీ లేకపోవడం కలిసొచ్చింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *