Breaking News
Home / States / Andhra Pradesh / గొర్రెపిల్లలపై దాడి చేసిన అడవిపిల్లి….

గొర్రెపిల్లలపై దాడి చేసిన అడవిపిల్లి….

శ్రీకాకుళం: సోంపేట మండలం తురక శాసనం గ్రామంలో ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో అడవిపిల్లి గొర్రెల సెలలో ఉన్న గొర్రెపిల్లలపై దాడి చేసి 6 పిల్లలని పీకలు కొరికి చంపిందని సంబంధిత యజమాని కర్రి సోమయ్య రోధించాడు. గత కొద్దిరోజులుగా అడవి జంతువుల దాడిలో పశువులు మృత్యువాత పడుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెండు రోజులు క్రితం అదే గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తికి సంబంధించిన 16 మేకపిల్లలు అడవిపిల్లి దాడిలో మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన మరువక ముందే మరోసారి దాడి జరగడంతో ప్రజలు భయబ్రాంతులు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *