Breaking News
Home / Film News / ఆయన్ను సీఎం చేయండని అభిమానుల కోరిక…..

ఆయన్ను సీఎం చేయండని అభిమానుల కోరిక…..

ఫిల్మ్ న్యూస్: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు దక్కించుకున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలకు సీట్లు తగ్గినప్పటికీ తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ శివసేన పట్టుబడుతోంది. మరోవైపు శివసేన డిమాండ్‌కు తలొగ్గని బీజేపీ సీఎం పీఠం తమదేనని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబన సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అనిల్‌ కపూర్‌ సీఎంగా ఉండాలంటూ ఆయన అభిమానులు ట్విటర్‌ ద్వారా కామెంట్లు చేస్తున్నారు. కాగా 2001లో విడుదలైన ‘నాయక్‌’ సినిమాలో అనిల్‌ కపూర్‌ ఒకరోజు సీఎంగా నటించారు. దీంతో అదే తరహలో నిజ జీవితంలో కూడా మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం తేలే వరకు ఆయనను సీఎంగా ఉండమంటూ ఈ విషయం గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, అదిత్య ఠాక్రే ఓసారి ఆలోచించాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కోరుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనిల్‌ కపూర్‌ ‘ నేను నాయక్‌లో మంచి నటుడిని మాత్రమే’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.

దీంతో ఆయన అభిమానులు ‘హ హ్హ హ్హా సినిమాలో కూడా మొదట నిరాకరించి ఆ తర్వాత సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారంటూ’ అప్పటి నాయక్‌ సినిమాలోని ఆయన పాత్రను గుర్తు చేశారు. ఇక ఈ ఏడాది అనిల్‌ కపూర్‌ ‘ఏక్‌ లడ్కీ కో దేఖా ఐసేహీ హోగా’, ‘టోటల్‌ ధమాల్‌’లో చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. అలాగే కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తఖ్త్‌’లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *