బెంగళూరు: కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కబడ తాలుకా నెల్యాడికి చెందిన పరీక్షిత్ నలుపు, తెలుపు రంగు కాగితాలు, ఓ బ్లేడు సాయంతో చూడచక్కని కళాఖండాలను తయారు చేస్తుంటాడు. అయితే ఇటీవల మూడు నిమిషాల 12సెకన్లలో కాగితాలతో మోదీ చిత్రపటాన్ని రూపొందించిన పరీక్షిత్ ‘ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తుమకూరుకు చెందిన చందన్ సురేశ్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. ఫైర్ ఆర్ట్‌లో కూడా పరీక్షిత్ మంచి ప్రావీణ్యం ఉంది. ఇటీవల మైసూర్లో జరిగిన దసరా ఉత్సవాల్లోనూ ప్రదర్శన ఇచ్చాడు. మంగళూరు శక్తినగర్ డిజైన్ సెంటర్లోని ప్రముఖ చిత్రకారుడు గోపాద్కర్ వద్ద ఈ చిత్రకళను అభ్యసించాడు.
