అమెరికా: అమెరికా చరిత్రలోనే శామ్యూల్ లిటిల్ అనే వ్యక్తి అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్. ఒకటో, రెండో హత్యలు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి. కానీ శామ్యూల్ ఏకంగా 93 హత్యలు చేశాడు. ఆయన 50 హత్యలు చేశాడని దర్యాప్తు అధికారులు సాక్ష్యాలు సంపాదించారు. మిగిలిన హత్యల విషయంలో ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శామ్యూల్ టార్గెట్గా చేసుకున్నవారిలో ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్న మహిళలే. 1970 నుంచి 2005 మధ్య హత్యల్లో కొందరి మృత దేహాలు ఇప్పటికీ దొరకలేదు. మూడు హత్యలకు శిక్ష పడడంతో 2014లో శామ్యూల్ జైలు పాలయ్యాడు. 2012లో పోలీసులకు చిక్కడంతో హత్యల విషయం బయటపడింది.
