Breaking News
Home / Sports / ఈతకెళ్లి మరణించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

ఈతకెళ్లి మరణించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

కాలిఫోర్నియా: ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ షాడ్ గ్యాస్‌పార్డ్(39) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మే 17వ తేదీన తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్‌కు సరదగా ఈతకు వెళ్లిన అతను అలల తాకిడికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. అక్కడ ఉన్న లైఫ్‌గార్డులు అతని కుమారుడిని ప్రమాదం నుంచి కాపాడారు. సముద్ర తీరం నుండి 50 గజాల దూరంలో గ్యాస్‌పార్డ్ ఉండటంతో ఏం చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇక గ్యాస్‌పార్డ్ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. సముద్రలో కొట్టుకుపోయే ముందు గ్యాస్ పార్డ్ అక్కడి లైఫ్ గార్డ్‌లను తన కుమారుడి రక్షించమని కోరినట్లు పేర్కొంది. రెండు రోజుల తర్వాత గ్యాస్‌పార్డ్ మృతదేహం లభ్యమైందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *