Breaking News
Home / States / Andhra Pradesh / బ్యారేజ్ లో దూకిన యువకుడు సురక్షితం….

బ్యారేజ్ లో దూకిన యువకుడు సురక్షితం….

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణానదిలో దూకిన యువకుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు కాపాడారు. ఇంటి యజమాని వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు సింహాద్రి తెలిపాడు. ఈ సందర్భంగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ… డబ్బులు ఇవ్వడం కొంచెం ఆలస్యం అయిందని, దీంతో ఇంటి ఓనర్ ప్రతి రోజూ తిడుతున్నారని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురిచేయడంతో భరించలేక మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పాడు. ఎంత కష్టపడినా సమయానికి డబ్బులు రావడంలేదని, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని చెప్పాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుడు మాట్లాడుతూ బాధితుడు నదిలో ముళ్లచెట్లు పట్టుకుని పెనుగులాడుతూ.. అరుస్తున్నాడని, తాము వెళ్లేసరికి కొంచెం వీక్‌గా ఉన్నాడని చెప్పారు. వెంటనే బోటులోకి ఎక్కించి, ధైర్యం చెప్పి ఒట్టుకు తీసుకువచ్చామని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *