ఫిల్మ్ న్యూస్: ప్రముఖ సినీ దర్శకుడు భారతి రాజా ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి.నగర్లోని కృష్ణన్ వీధిలో భారతిరాజా నివసిస్తున్నారు. రూ.లక్ష విలువైన ఐఫోన్, పూజ గదిలో ఉంచిన రూ.లక్ష విలువైన వెండి వస్తువులు, రూ.15 వేల నగదు అదృశ్యం కావడం గమనించిన రాజా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అగంతకుల కోసం గాలిస్తున్నారు. అలాగే, ఆయన ఇంట్లో పనిచేస్తున్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
