సూర్యాపేట: రామాలయం తాళాలు పగులగొట్టి దొంగలు విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని రామాలయంలో జరిగింది. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తాళం పగుల గొట్టి లోనికి ప్రవేశించి లక్ష్మణుడి ఉత్సవ విగ్రహం, వెండి పళ్ళెం, ఇతర విలువైన వస్తువులు దొంగిలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
