Breaking News
Home / National / వారి ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది….

వారి ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది….

దాద్రి: హరియాణాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట్లో అధికార బీజేపీ పార్టీ గట్టి పోటీ ఇవ్వగా తర్వాత కాంగ్రెస్ కూడా పుంజుకోవడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగాట్‌ ఈ ఏడాదే రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారిగా బీజేపీ నుంచి బరిలోకి దిగి దాద్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఫలితాల పట్ల తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా గెలిచి తీరుతానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ

‘ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికి నాలుగేళ్లు ఎదురు చూస్తాం. ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తోంది. ప్రజలు నాకు మద్దతిచ్చారు. వారి ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది. అదే నా బలం. ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. రెజ్లర్‌గా ఆటలోకి దిగే ముందు ఎందరో నన్ను ప్రోత్సహిస్తుంటారు. అలానే ఇప్పుడు నేను రాజకీయం అనే రెజ్లింగ్‌కి దిగాను. ఇక్కడ నాకు మరింత మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని బబితా తెలిపింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *