Breaking News
Home / States / Andhra Pradesh / అపోజిషన్ ఇవ్వడంతో వారితో గడిపే అవకాశం…

అపోజిషన్ ఇవ్వడంతో వారితో గడిపే అవకాశం…

విశాఖ: గురువారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైతే పార్టీ కోసం సమర్థవంతంగా పని చేస్తారో వారికే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. నవంబర్‌లో పార్టీ ఎన్నికల ఉంటాయని, చాలా చోట్ల సమర్థులకు పెద్ద పేట వేయ్యలేకపోయానని, ఇకపై సమర్థులకే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు నేతలను ఎన్నుకునే అవకాశం ఉందని, పాత వాళ్లే కూర్చుంటే పనికిరాదని, యువత కూడా రావాలని పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. జీవితాంతం కార్యకర్తలకు రుణపడి ఉన్నానని, అపోజిషన్ ఇచ్చి కార్యకర్తలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కల్పించారని భావిస్తున్నానని అన్నారు. రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో పర్యటించి, సమీక్షలు నిర్వహిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *