Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పండగ బండి కిటకిట

పండగ బండి కిటకిట

వారాంతం కావడంతో మరింతగా పెరిగిన తాకిడి
అన్ని దారులూ బెజవాడకే..
అదనం 100 బస్సులేసినా బస్‌స్టేషన్‌లో తగ్గని ఒత్తిడి
టీఎస్‌ఆర్టీసీ కొత్తగా వేసిన 87 స్పెషల్స్‌తో మరీ రద్దీ
విమాన ధరలకు రెక్కలు
హైవేపై కదలని ట్రాఫిక్‌
విజయవాడ: పండగ కోలాహలం పతాకస్థాయికి చేరింది! సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు చేరుకొనే వారిసంఖ్య ఈసారి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారాంత సెలవులు కూడా కలిసి రావడంతో పండగ ర ద్దీ మరింత పెరిగిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా బస్‌ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వి మానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి. షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ తాకిడిని రాబడిగా మార్చుకోవడానికి ఆర్టీసీ, రైల్వే లు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు ఓవర్‌ డ్యూటీలు చేస్తున్నారు. దూరప్రాంతాలైన హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల నుంచి విజయవాడకు భారీగా ప్రయాణికులు వస్తున్నారు. శుక్రవారం రాత్రి బయలుదేరిన 87 స్పెషల్‌ బస్సులు శనివారం ఉదయం విజయవాడకు చేరుకున్నాయి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 100 బస్సులను శనివారం ఉదయం హైదరాబాద్‌కు పంపారు. మనకు సమాంతరంగా టీఎ్‌సఆర్‌టీసీ కూడా ఇంతేస్థాయిలో స్పెషల్‌ బస్సులను నడుపుతోంది. దీంతో పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ శనివారం ఉదయం నుంచి కిటకిటలాడుతోంది. హైదరాబాద్‌, చెన్నైల నుంచి ఇక్కడకు వస్తున్న ట్రాఫిక్‌ను తరలించటానికి లోకల్‌గా 100కు పైగా స్పెషల్‌ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ముందుగా నిర్దేశించుకున్న రూట్లలో మాత్రమే కాకుండా అప్పటికప్పుడు డిమాండ్‌ను బట్టి విభిన్న ప్రాంతాలకు స్పెషల్స్‌ ను నడపాల్సి వస్తోంది. రిజర్వేషన్‌ లేకుండానే అప్పటికప్పుడు ప్రయాణికుల డిమాండ్‌ ఎటుఉంటే అటు బ స్సులను అధికారులు నడుపుతున్నారు. ఇలాంటి సర్వీసులను శనివారం మధ్యాహ్నం వరకు 130 నడిపారు. అయినా, చాలక ప్రయాస పడుతున్నారు.

ఊపిరి సలపనంతగా..
హైదరాబాద్‌ నుంచి వచ్చేవారితోపాటు, విజయవాడనుంచి వెళ్లేవారితో శనివారం రైళ్లన్నీ కిటకిటలాడిపోయాయి. షెడ్యూల్‌ రైళ్లలో రెండువారాల కిందటే రిజర్వేషన్‌ జరిగింది. సికింద్రాబాద్‌, విశాఖపట్నం, కాకినాడకు ప్రత్యేకంగా నడుపుతున్న రైళ్లు కూడా హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని నడుపుతున్న జనసాధారణ్‌ రైళ్లు రద్దీగా మారాయి. జనరల్‌ టికెట్ల విక్రయాలు భారీగా జరిగాయి. మొత్తం 24 బుకింగ్‌ కౌంటర్లు రాత్రింబవళ్లూ నిర్విరామంగా పనిచేస్తున్నాయి. జనసాధారణ్‌ రైళ్లకు అనూహ్య డిమాండ్‌ ఉండటంతో జనరల్‌ టికెట్ల విక్రయాలు భారీగా జరిగాయి. రైల్వేస్టేషన్‌లో ఆటోమేటివ్‌ టిక్కెటింగ్‌ వెండింగ్‌ మెషీన్ల(ఏటీవీఎం) దగ్గర అయితే విపరీతమైన రద్దీ ఉంది. మొత్తం 12 ఏటీవీఎంల దగ్గర టిక్కెట్లు జారీచేసే ఆపరేటర్ల సమయ వేళలను పెంచారు. సాధారణ రోజుల్లో 8 గంటల పాటు టిక్కెట్‌ విక్రయించే ఆపరేటర్లు 10గంటలు ఆపైనా జనరల్‌ టిక్కెట్లు జారీ చేస్తూనే ఉన్నారు.

10శాతం పెరిగిన ఆక్యుపెన్సీ
హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు నడుస్తున్న విమానాల్లో వారంరోజులుగా ఆక్యుపెన్సీ ఒక్కసారిగా 10శాతం పెరిగింది. ప్రాంతీయంగా విశాఖ, కడప, తిరుపతి నుంచి కూడా ఇంతేస్థాయిలో ఆక్యుపెన్సీ పెరగటం విశేషం. శుక్ర, శనివారాలలో అప్పటికప్పుడు టిక్కెట్లు దొరకటం కూడా దుర్లభమయింది. సాధారణ టిక్కెట్లు దొరకకపోవటం వల్ల బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్లలో చాలామంది రాకపోకలు సాగిస్తున్నారు.

చీమల బారులా..
కంచికచర్ల: హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి శనివారం వాహనాలతో కిటకిటలాడింది. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ ఇంకా తగ్గలేదు. జాతీయ రహదారిపై వాహనాలు చీమల బా రులా నడుస్తున్నాయి. శుక్రవా రం నుంచి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కనిపించినప్పటి కీ, అది శనివారం మరింత పెరిగింది. శుక్ర, శనివారాల్లో 25వేలకు పైగా వాహనాలు వచ్చాయి. వీటిలో 70 శాతానికి పైగా కార్లు కావటం విశేషం.

వార్‌ వన్‌సైడే!
విజయవాడలోని రామవరప్పాడు రింగు వద్ద ఉన్న ఫ్లైఓవర్‌కు సంక్రాంతి కళ వచ్చింది. ఈ రోడ్డుపై శనివారం భారీగా వాహనాలు బారులు తీరాయి.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *