Breaking News
Home / States / అక్కడ ప్లాస్టిక్ నిషేధించి ఈ రోజుకు ఏడాది….

అక్కడ ప్లాస్టిక్ నిషేధించి ఈ రోజుకు ఏడాది….

హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్‌రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) సంస్థలో ప్లాస్టిక్‌ను నిషేధించి సరిగ్గా ఏడాది. ప్లాస్టిక్‌ను వినియోగించకూడదని కిందటి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఈ రోజుకూ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్ళు అక్కడ కనబడవు. ‘ఏ రకం ప్లాస్టిక్ బాటిళ్ళను కూడా వినియోగిచకుండా ఉండడంలో మా సంస్థలో ఈ రోజుతో ఏడాది దాటింది’ అని డీఆర్‌డీఏ అధికారి ఒకరు వెల్లడించారు. డీఆర్‌డీఏ ఛీఫ్‌గా జి. సతీష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే(ఆగస్ట్ 29) ప్లాస్టిక్ నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌పే వినియోగించకూడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తన కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచే తొలిగా మొదలుపెట్టారు. ఆ తర్వాత మొత్తం సంస్థకంతటికీ విస్తరించారు. మొత్తంమీద డీఆర్‌డీఓ ఇప్పుడు ‘ప్లాస్టిక్ ఫ్రీ’ సంస్థగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *