Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎంఎస్ఎంఈలలో కార్మికుల కొరత ఉంది….

ఎంఎస్ఎంఈలలో కార్మికుల కొరత ఉంది….

అమరావతి: వైస్సార్ నవోదయం కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశ స్థూల ఉత్పత్తిలో 8 శాతం అందిస్తున్నాయన్నారు. తయారీరంగంలో 40 శాతం, ఎగుమతుల్లో 45 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈలలో కార్మికుల కొరత ఉందని, జిల్లాల్లో చిన్న పరిశ్రమల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. టెక్నికల్ రిపోర్ట్‌ తయారీకి ఆడిటర్లకు ఎంఎస్‌ఎంఈలు చెల్లించే ఫీజులో..50 శాతం లేదా గరిష్ఠంగా రూ.2లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *