కర్నూలు: ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. డోర్లు మూసేశామని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవర చెప్పుకొచ్చారు. ఇది సునీల్ దేవర మాట కాదని.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా చెప్పిన మాట అని ఆయన తేల్చిచెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ శకం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. ‘చంద్రబాబు కట్టప్ప లాంటి వాడు.. వెన్నుపోటు పొడిచాడు. జనసేన, వైసీపీలతోనూ ఎలాంటి ఒప్పందం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి మద్దతు ఉండదు. బీజేపీ స్వతహాగా ఎదుగుతుందని అన్నారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు అయ్యారు. సీమకు ద్రోహం చేశారు. జగన్ సీఎం అయ్యి 6 నెలలు మాత్రమే అయ్యింది. ఆయన పాలన ఎలా ఉంటుందో చూడాలి’ అని సునీల్ చెప్పుకొచ్చారు.
