Breaking News
Home / Film News / మా మధ్య ఎలాంటి గొడవల్లేవు

మా మధ్య ఎలాంటి గొడవల్లేవు

చిరంజీవికి, తనకూ మధ్య ఎలాంటి గొడవలు, అపోహలు లేవని సినీ నటుడు రాజశేఖర్‌ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపై రాజశేఖర్‌ ఆవేశంతో ప్రసంగించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు చిరంజీవితో సహా అందరూ అసహనం వ్యక్తం చేశారు. కాగా, గురువారం ఉదయం జరిగిన పరిణామాలపై రాజశేఖర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

”ఈరోజు ఏం జరిగినా అది నాకూ, నరేశ్‌కు, ‘మా’కు మధ్య మాత్రమే జరిగింది. ఏ ఒక్క పనీ సరిగ్గా జరగడం లేదు. అందుకే నేను మాట్లాడకుండా ఉండలేకపోయా. నాకూ చిరంజీవిగారికి, మోహన్‌బాబుగారికి మధ్య ఎలాంటి అపోహలు, గొడవలు లేవు. నా వల్ల ఉదయం జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశా. చిత్ర పరిశ్రమకు నా వల్ల ఏం సాయం కావాలన్నా చేస్తా. ఈరోజు జరిగిన దానిని దయ చేసి పెద్దదిగా చూపించకండి.

ముఖ్యంగా చిరంజీవిగారికీ, మోహన్‌బాబుగారికీ నాకూ మధ్య జరిగిన గొడవగా దీన్ని సృష్టించవద్దు. వారిద్దరి పైనా నాకు అమిత గౌరవం ఉంది. ‘మా’కు వారి సేవలు అవసరం. దయ చేసి దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దు’

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *