బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని సిఈసి కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని, ఈవీఎంలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. త్వరలోనే దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల కోడ్‌పై చర్చిస్తామన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల విధానాన్ని సమర్థించిన విషయాన్ని ఆరోరా గుర్తు చేశారు.
