Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు: చంద్రబాబు

టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు: చంద్రబాబు

రాజమండ్రి: టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రత్యర్థుల అడ్డంకుల్ని పోటాపోటీగా ఎదుర్కొన్నామని, టీడీపీకి, రాష్ట్రానికి నష్టం చేయాలని ప్రధాని మోదీ చేయని ప్రయత్నం లేదని దుయ్యబట్టారు. టీడీపీకి నష్టం చేయాలని తెలంగాణ సీఎ కేసీఆర్‌ అనేక ప్రయత్నాలు చేశారని, జగన్‌ కుట్రలకు మోదీ, కేసీఆర్‌ కుతంత్రాలు తోడయ్యాయని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. పోటీకి అభ్యర్థులు లేనప్పుడు సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడారని, ప్రమాణ స్వీకార ముహూర్తం, మంత్రి పదవులు మైండ్‌గేమ్‌లో భాగమేనన్నారు. వీళ్లకు తోడు మాస్టర్‌ సెఫాలజిస్ట్‌ ప్రశాంత్ కిషోర్ తోడయ్యాడని ఆరోపించారు.

‘‘హింస, విధ్వంసాలకు స్కెచ్‌లు వేసి అమలు చేశారు. ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలు చేశారు. టీడీపీ నేతలను బెదిరింపులకు గురి చేశారు. రాబోయే ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి. ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి. 110 బహిరంగసభలు, రోడ్ షోలు చేశా. ప్రతిపక్ష నేత 60-70 సభలు పెట్టలేకపోయారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఊళ్లకు వెళ్తే నిలదీశారు. మన ఎమ్మెల్యేలపై పనులు చేయలేదనే అసంతృప్తి లేదు. ఏపీలో ఓటేసేందుకు రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఎంతోమంది విలన్లను తట్టుకుని నిలబడ్డాం. కేసుల మాఫీ, పదవి కోసమే వైపీపీ పోరాటం. వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్‌ బేరాలు ప్రారంభించారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Check Also

నదిలోకి కొత్తనీరు…

Share this on WhatsAppనిర్మల్: నిర్మల్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నది జలకళ సంతరించుకుంది. ఎగువన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *