Breaking News
Home / States / Andhra Pradesh / రాజధాని నిర్మాణంలో పురోగతి లేదు….

రాజధాని నిర్మాణంలో పురోగతి లేదు….

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తి అయిందని, ఐదు నెలలుగా రాజధాని నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని చంద్రబాబు ప్రయత్నించారని.. అందుకు రైతులంతా చంద్రబాబుకి సహకరించారన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం వైసీపీకి ఇష్టం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రిజర్వ్ నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదా? అని అన్నారు. నిర్మాణ పనులు ఎందుకు ఆపేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *