Breaking News
Home / Sports / టీమిండియా మూడోమ్యాచ్‌ ఆడడం అనుమానమే….?

టీమిండియా మూడోమ్యాచ్‌ ఆడడం అనుమానమే….?

నాటింగ్‌హామ్‌: ప్రపంచక్‌పలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుపొంది జోరుమీదున్న టీమిండియా తమ మూడోమ్యాచ్‌ ఆడడం అనుమానమే. నాటింగ్‌హామ్‌లోని టెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వర్షం భారత్‌, కివీస్‌ మ్యాచ్‌కూ అడ్డుపడే అవకాశముంది. బర్మింగ్‌హామ్‌, పీటర్‌బొరో, న్యూ కాజిల్‌ సహా ఇంగ్లండ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. సుదీర్ఘంగా కురిసే వర్షంతో వరదలు కూడా వచ్చేందుకు ఆస్కారముందని, రవాణాకు తీవ్ర అంతరాయం కలగొచ్చని ప్రజలను హెచ్చరించింది. కాగా, నాటింగ్‌హామ్‌లో బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసి, గురువారం మధ్యాహ్నం వరకు జల్లులు కురుస్తాయని పేర్కొంది.

ఆరోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలు, కనిష్ఠంగా 10 లేదా 11 డిగ్రీలు ఉంటుందని తెలిపింది. దీంతో కివీ్‌సతో భారత్‌ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు కోహ్లీసేన కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచింది. అయితే, ఈ మెగా టోర్నీ వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ను కివీస్‌ ఓడించిన నేపథ్యంలో ఇరుజట్ల మధ్య జరిగే అసలైన మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

టీమిండియా ప్రాక్టీస్‌ రద్దు
కోహ్లీసేనకు వరుసగా రెండోరోజూ ప్రాక్టీ్‌సకు దూరమైంది. వర్షం కారణంగా మంగళవారం ఇక్కడ జరగాల్సిన టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది. దీంతో రోజంతా ఆటగాళ్లు హోటల్‌ గదుల్లోనే గడపాల్సి వచ్చింది.

Check Also

టాప్ ర్యాంక్ కు అడుగు దూరంలో కోహ్లీ…

Share this on WhatsAppదుబాయి: టెస్టుల్లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోవడానికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకే ఒక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *