Breaking News
Home / States / ‘ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు.. అంతా విపక్షాల కుట్రే’

‘ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు.. అంతా విపక్షాల కుట్రే’

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీ యూనియన్‌ నేతలు విపక్షాల వలలో చిక్కుకున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నామని.. ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి!
‘ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ నేతలు డ్రామాలు ఆపాలి. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతల వేషాలు వేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయడం లేదు?. కార్మికుల ఆత్మహత్యాయత్నాలకు రెచ్చగొట్టేవారిదే బాధ్యత. ఆర్టీసీ సమ్మె చేయటం ప్రజలను ఇబ్బందులు పెట్టడమే. విలీనం చేస్తామని మేము మ్యానిఫెస్టోలో చెప్పలేదు. చెప్పుడు మాటలతో యూనియన్ లీడర్లను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వంపై కుట్రగా భావిస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు రాజకీయం చేస్తున్నాయో అర్ధం చేసుకోవాలి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొడుతున్నాయి. బీజేపీ డ్రామాలు బంద్ చేయాలి.. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆర్టీసీకి ఎవరు అడ్డుపడే ప్రయత్నం చేసినా లాభాల బాటలోకి తీసుకొవస్తాం. తెలంగాణ సాధన కోసం ఆనాడు బలిదానాలు ఉద్యమం కోసం కార్మికుల ఆత్మహత్యయత్నాలకు రెచ్చగొట్టే వారిదే భాద్యత’ అని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *