Breaking News
Home / States / మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చు…

మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చు…

నల్గొండ : మున్సిపల్ ఎన్నికలకు అవాంతరాలు ఉండకపోవచ్చని, ఆ ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధి వైపే ఉంటారని భావిస్తున్నానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. 2019లో దిశ లాంటి కొన్ని సంఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, భవిష్యత్‌లో ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్రంగా ముందుకు సాగుతోంది గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *