Breaking News
Home / Film News / బిగ్ బాస్ హౌస్ లో డేంజర్ జోన్ లో ఉన్నది ఈ వీరిద్దరె…….

బిగ్ బాస్ హౌస్ లో డేంజర్ జోన్ లో ఉన్నది ఈ వీరిద్దరె…….

గత కొద్దీ రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని అలరిస్తున్నటువంటి అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇక చివరి దశకు చేరుకుంది. కాగా ఇప్పటివరకు కూడా ఈ ఇంటిలో ఉన్నటువంటి ఈ ఇంటి సభ్యుల మధ్యన ఎవరికీ ఈ మూడవ సీజన్ టైటిల్ వస్తుంది అనే ప్రశ్న అందరిని కూడా ఉత్కంఠ కి గురిచేస్తుందిఅని చెప్పాలి. కాగా ఇటీవలే ఇంటి సభ్యుడైన అలీ రెజా తన అత్యుత్సాహం వలన ఫైనల్ కి చేరిపోయే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కాగా చివరగా ఈ షో నిర్వాహకులు అలీ స్థానాన్ని రాహుల్ తో భర్తీ చేయించనున్నారని సమాచారం. ఇకపోతే ఈసారి నామినేషన్లకు మిగిలిన 5 మంది వచ్చారు.

కాగా ఇప్పుడు ఈ 5 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పటికీ నామినేషన్ అయిన వారిలో శివ జ్యోతి, అలీ ఇద్దరు కూడా చాలా నెగిటివిటి ని సొంతం చేసుకుని, ప్రేక్షకుల్లో వ్యతిరేకత కూడగట్టుకున్నారు. కాగా బాబా భాస్కర్ మీద కూడా కొంత మేరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈవారానికి డేంజర్ జోన్ లో శివ జ్యోతి మరియు అలీ రెజా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కాగా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *